కరోనా కాలంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి: మంత్రి గౌతం రెడ్డి | Mekapati Goutham Reddy Comments On Development In Ap | Sakshi
Sakshi News home page

కరోనా కాలంలోనూ ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి: మంత్రి గౌతం రెడ్డి

Jun 8 2021 3:23 PM | Updated on Jun 8 2021 6:17 PM

Mekapati Goutham Reddy Comments On Development In Ap - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా కాలంలోనూ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు. కోవిడ్‌-19 తో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల జీడీపీ తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమంతోపాటుగా పారిశ్రామిక అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరుగుతుందని మంత్రి గౌతంరెడ్డి పేర్కొన్నారు. 2030 ఏడాది టార్గెట్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. ఏపీని పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామని గౌతంరెడ్డి వెల్లడించారు.

సీఎం జగన్‌ ముందుచూపు వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. పారిశ్రామిక కారిడర్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా నూతన పరిశ్రమల ఏర్పాటుకు సులభతర విధానాలను  అవలంభిస్తున్నామని తెలిపారు. దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10 శాతం ఉండేలా కృషి చేస్తున్నామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి పేర్కొన్నారు.

చదవండి: 15 వేల గ్రామ సచివాలయాల్లో ఏఆర్‌సీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement