AP: మున్సిపల్‌ కార్మికుల సమ్మె విరమణ | Meeting Success With Municipal Workers In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చర్చలు సఫలం.. సమ్మె విరమించిన ఏపీ మున్సిపల్‌ కార్మికులు

Jan 10 2024 7:05 PM | Updated on Jan 10 2024 8:02 PM

Meeting Success With Municipal Workers In Andhra Pradesh - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులు గురువారం నుంచి విధులకు హాజరు కానున్నారు.. 

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రి వర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం అయిన వెంటనే సమ్మె విరమణ ప్రకటన చేశాయి సంఘాలు. దీంతో.. రేపటి నుంచి మున్సిపల్‌ కార్మికులు యధావిధిగా తమ విధులకు కార్మికులు హాజరు కానున్నారు.

పలు డిమాండ్ల సాధనతో మున్సిపల్‌ కార్మికులు సమ్మెలోకి దిగారు. అయితే గత చర్చల్లో ప్రభుత్వం వాళ్ల డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినప్పటికీ.. కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు. దీంతో నేడు మరోసారి భేటీ కావాల్సి వచ్చింది. చివరకు చర్చలు సఫలం కావడం.. సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించడంతో.. ముగింపు పడినట్లయ్యింది.

మున్సిపల్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు బొత్స సత్యనారాయణ. ప్రభుత్వ హామీలకు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపాయని పేర్కొన్నారు. 21 వేల వేతనంతో పాటు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని,. సమ్మె కాలానికి జీతాలు కూడా చెల్లిస్తామని తెలిపారు. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తామన్నారు. ఈ సంక్రాంతికి ప్రతి కార్మికునికి కొత్త బట్టల కోసం వెయ్యి రూపాయలు ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు.

చనిపోయిన కార్మికులు కుటుంబాలకు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం నష్టపరిహారం అందిస్తామని మంత్రి బొత్స అన్నారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే అందించే సాయాన్ని అయిదు నుంచి ఏడు లక్షలకు పెంచినట్లు తెలిపారు. 2019 నుంచి దరఖాస్తు చేసుకోని మృతుల కుటుంబాలు ఇప్పుడు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.  జీవో ఇచ్చిన తర్వాత అప్లై చేసుకుంటే రెండు నెలల్లో ఎక్స్ గ్రేషియా ఇస్తామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement