ఏ దేవుడో కాపాడాడు.. | Massive Fire at Visakhapatnam Steel Plant | Sakshi
Sakshi News home page

ఏ దేవుడో కాపాడాడు..

Jun 9 2026 8:18 AM | Updated on Jun 9 2026 12:13 PM

Massive Fire at Visakhapatnam Steel Plant

చికిత్స పొందుతున్న అర్జున అప్పారావు

గాజువాక: స్టీల్‌ప్లాంట్‌లో చోటుచేసుకున్న హృదయ విదారక ప్రమాదంలో ఒక ఉద్యోగి తృటిలో తప్పించుకొని స్వల్ప గాయంతో బయటపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతడి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. వడ్లపూడికి చెందిన గుడివాడ అర్జున అప్పారావు బీ షిఫ్ట్‌ విధులకు వెళ్లారు. డిపార్ట్‌మెంట్‌లో 20 అడుగుల ఎత్తులో పని చేస్తున్న ఆయన మూత్ర విసర్జనకని కిందకు దిగి వెళ్తున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకొని లాడిల్‌ పేలిపోయింది. 

ఈ ప్రమాదంలో చెల్లాచెదురుగా పడిన లిక్విడ్‌ ఐరన్‌ అతడి పిరుదులపై కొద్దిగా పడటంతో స్వల్ప గాయంతో బయటపడ్డాడు. తనను ఏ దేవుడో రక్షించాడంటూ ఆయన కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా, ఈ ప్రమాదంలో అతడు కూడా మృతి చెందాడని పుకారు రావడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే, అతనికి ఏమీ కాలేదని, స్వల్ప గాయం మాత్రమే అయిందనే విషయం తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement