మరో కుట్రకు తెరతీసిన విశాఖ ఉక్కు యాజమాన్యం | Management is pressuring the steel workers of Visakhapatnam to take VRS | Sakshi
Sakshi News home page

మరో కుట్రకు తెరతీసిన విశాఖ ఉక్కు యాజమాన్యం

Jan 12 2025 7:42 AM | Updated on Jan 12 2025 10:23 AM

Management is pressuring the steel workers of Visakhapatnam to take VRS

విశాఖ,సాక్షి: విశాఖ ఉక్కుపై (vizag steel) నీలినీడలు కమ్ముకున్నాయి. కార్మికులను సాగనంపేందుకు యాజమాన్యం కుట్రకు తెరతీసింది.  ఇందులో భాగంగా కార్మికుల్ని సాగనంపేందుకు సిద్ధమైంది. వీఆర్ఎస్ (vrs) పథకం అమలుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్‌లో 45 ఏళ్ల వయసు, 15 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు వీఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.తద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బయటకు పంపేందుకు యాజమాన్యం సిద్ధమైంది.

కాగా,వీఆర్ఎస్ నిర్ణయంపై విశాఖ ఉక్కు పోరాట కమిటీ తీవ్రంగా మండిపడుతుంది. వీఆర్ఎస్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కార్మికులు వీఆర్ఎస్ తీసుకోవద్దని పోరాట కమిటీ పిలుపు నిచ్చింది.  

అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.

ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది.  అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.

దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో  మాట్లాడేందుకు అపాయింట్మెంట్‌ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు.  దసరాకు బోనస్ , దీపావళికి జీతం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వీఆర్‌ఎస్‌ పేరుతో యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

👉ఇదీ చదవండి : బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం..!

Advertisement
 
Advertisement
Advertisement