పిల్లల్లో పెరుగుతున్న పౌష్టికాహార లోపం

Malnutrition In Children Poshan Abhiyaan Report Key Points - Sakshi

ముఖ్యమైన విటమిన్స్‌, మినరల్స్‌ లోపం అధికం

పోషన్‌ అభియాన్‌ మూడో నివేదిక వెల్లడి

కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా అదనపు పోషకాహారం అందించాలని సూచన

సాక్షి, అమరావతి : పిల్లల్లో పౌష్టికాహార లోపం దేశంలో పెద్ద సవాలుగా తయారైందని పోషన్‌ అభియాన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాది నుంచి నాలుగో ఏడాది వరకు పిల్లలు అత్యధికంగా రక్తహీనతతో బాధ పడుతున్నారని పోషన్‌ అభియాన్‌ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వెల్లడించిన మూడవ నివేదికలో స్పష్టం చేసింది. 5-9 సంవత్సరాల లోపు పిల్లలతో పాటు 10-19 సంవత్సరాల పిల్లల్లో రక్తహీనతతో పాటు విటమిన్‌ ఏ, విటమిన్‌-డి, బి-12, జింక్‌ లోపాలు అత్యధికంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల పిల్లల్లో ఎక్కువ బరువు, ఊబకాయం పెరుగుతోందని.. ఇందుకు ప్రధాన కారణం ఆహారపు అలవాట్లేనని నివేదికలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అదనపు పోషకాహారం అందించాలని సూచించింది. సమగ్ర శిశు అభివృద్ధి సర్వీసెస్‌-సంయుక్త అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌‌ ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను, గర్భిణులను గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సప్లిమెంటరీ పోషకాలను అందించాల్సి ఉందని స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎక్కువ పౌష్టికాహార లోపం గల పిల్లలు ఉంటున్నారని, రక్తహీనత కూడా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా ఉందని, ఆ జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొంది. 
 

దేశ వ్యాప్తంగా పోషకాహార లోపం ఉన్న పిల్లల వివరాలు

రక్తహీనత

1-4 ఏళ్లలోపు పిల్లలు 41 శాతం
5-9 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం
10-19 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం

విటమిన్‌-డి లోపం

1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం
5-9 ఏళ్లలోపు ప్లిలలు 18 శాతం
10-19 ఏళ్లలోపు పిల్లలు 24 శాతం

విటమిన్‌ బి-12 లోపం

10-19 ఏళ్లలోపు పిల్లలు 31 శాతం
5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం
1-4 ఏళ్లలోపు పిల్లలు 14 శాతం

పోలిక్‌ యాసిడ్‌ లోపం

10-19 ఏళ్లలోపు పిల్లలు 37 శాతం
5-9 ఏళ్లలోపు పిల్లలు 28 శాతం
1-4 ఏళ్లలోపు పిల్లలు     23 శాతం

జింక్‌ లోపం

10-19 ఏళ్లలోపు పిల్లలు 32 శాతం
1-4 ఏళ్లలోపు పిల్లలు 19 శాతం
5-9 ఏళ్లలోపు పిల్లలు 17 శాతం
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top