Love Marriage: Bridegroom Goes Missing Four Days Before Wedding in Vizag - Sakshi
Sakshi News home page

నాలుగేళ్లుగా ప్రేమ.. పెళ్లికి పెద్దల అంగీకారం..4 రోజుల్లో పెళ్లి.. చివర్లో ట్విస్ట్‌! 

Feb 7 2022 5:05 PM | Updated on Feb 7 2022 6:07 PM

Love Marriage: Bridegroom Goes Missing Four Days Before Wedding in Vizag - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,మల్కాపురం(విశాఖ పశ్చిమ): వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమను గుర్తించిన పెద్దలు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. నాలుగు రోజుల్లో పెళ్లి అనగా.. వరుడు అదృశ్యమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు, ఆమె తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మల్కాపురం సమీపంలోని ప్రకాష్‌నగర్‌కు చెందిన యువతి, 58వ వార్డు పరిధి అజంతా కాలనీలో ఉంటున్న మణికంఠ ఒకరినొకరు నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకుని.. ఈ నెల 10వ తేదీన స్థానిక కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిర్ణయించారు.
చదవండి: అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలి: సీఎం జగన్‌

ఇరు కుటుంబాలు బంధువులకు పెళ్లి కార్డులను అందించి ఆహ్వానించారు. ఇంతలో వరుడు అదృశ్యమయ్యాడు. ఆదివారం సాయంత్రం నుంచి ఇంట్లో కనిపించకుండా పోయాడు. దీంతో ఆ యువకుడి తల్లిదండ్రులు చుట్టు పక్కల, బంధువుల ఇళ్ల వద్ద వెతికారు. ఫలితం లేకపోవడంతో వధువు తల్లిదండ్రులకు తెలిపారు. పెళ్లికి నాలుగు రోజులుండగా.. ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో వారు ఆందోళనకు చెందుతున్నారు. పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై పూర్తి సమాచారం సేకరించిన తర్వాత కేసు నమోదు చేస్తామని మల్కాపురం పోలీసులు తెలిపారు. 
చదవండి: పెళ్లి జరిగిందన్న ఆనందం నిలువక మునుపే ఆ ఇంట మృత్యుఘోష

Advertisement
 
Advertisement
Advertisement