
సాక్షి,విశాఖపట్నం:విశాఖ నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో మంగళవారం(ఫిబ్రవరి 18) ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. నోవాటెల్‌కు ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి ఇసుకలారీ దూసుకుపోయింది. ఈ సమయంలో అక్కడ వాకర్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్,మరొకరికి గాయాలయ్యాయి.బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.గతంలో ఇదే ప్రాంతంలో రెండుసార్లు ప్రమాదాలు జరగడం గమనార్హం.
