‘యజ్ఞ ఫలితంగానే  రాష్ట్రానికి పెండింగ్‌ నిధులు’

Kottu Satyanarayana Comments On Pending Funds Released By Central Govt  - Sakshi

సాక్షి, తిరుమల: తమ ప్రభుత్వం శ్రీమహాలక్ష్మీ యజ్ఞాన్ని వైభవంగా నిర్వహించిందని,యజ్ఞ ఫలితంగానే  రాష్ట్రానికి పెండింగ్‌ నిధులు వచ్చాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. సీఎం జగన్‌ ప్రయత్నం సఫలం కావడంతో పెండింగ్‌ నిధులు వచ్చాయన్నారు.

‘ పీఠాధిపతులు సూచనల మేరకు కార్తీకమాసంలోశ్రీశైలంలో కుంభాభిషేకం. రూ. 5లక్షల లోపు ఆదాయం ఉన్న ఆలయాలను సంబంధిత ట్రస్ట్‌ బోర్డు నిర్వహించేలా కేబినెట్‌లో నిర్ణయం. ఆయా దేవాలయాలపై పర్యవేక్షణ దేవాదాయశాఖకు ఉంటుంది. లీజు ముగిసినా కోర్టును ఆశ్రయిస్తూ స్టేలు పొందే వారిపై 15 రోజుల నోటీసుతో చర్యలు తీసుకునేలా చట్ట సవరణను ఆమోదించాం. దేవాదాయ ఆస్తుల కాపాడుకోవడానికి చట్టసవరణ. చట్ట సవరణ ద్వారా గడువు ముగిసిన లీజు భూములను మార్కెట్‌ రేటు ప్రకారం మళ్లీ లీజుకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’ అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.

రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికలు సమీపిస్తున్నందున కొన్ని రాబంధులు వాలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని విమర్శించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. రాబంధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు చేసిన మేలు చెప్పి ఓట్లు అడుగుతామని, ఇది పేదలకి, పెత్తందార్లకి మధ్య జరిగే ఎన్నికలన్నారు. 

‘సత్యానికి, అసత్యానికి జరుగుతున్న పోరాటం ఇది. న్యాయానికి, అన్యాయానికి జరుగుతున్న పోరాటం ఇది. చంద్రబాబు, పచ్చ మీడియా అంతా ఒక వైపు ఉన్నారు. చంద్రబాబు  తెలంగాణ నివాసి. రాష్ట్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం అప్పులు పాలు చేశారని చంద్రబాబు, పవన్‌లు విమర్శించారు. చంద్రబాబు,దత్తపుత్రుడు చేస్తున్న మోసాలను ప్రజలు గమనిస్తున్నారు.ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి మహానాడు అంటూ దండలు వేస్తున్నారు. వ్యవసాయం అంటే నీకు గిట్టదు.. విద్యపై ఒక్క రోజు ఫోకస్‌ చేయలేదు.నీకు, సీఎం జగన్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. పవన్‌ గతంలో కాపు సామాజికి వర్గాన్ని ముంచేశారు’ అని మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top