కాకినాడ టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన బోటు యజమానులు

Kakinada Boat Accident Boat Owners Stormed the TDP Office - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ టీడీపీ జిల్లా కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బోటు యమజానులు టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇటీవల ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదానికి గురయిన బోటుపై టీడీపీ నేత పట్టాభి అసత్య ప్రచారం చేశాడు. పట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహించిన బోటు యజమానులు.. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పాలని మత్స్యకారులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు, మత్స్యకారులకు మధ్య తోపులాట జరిగింది. బోటు యజమానులు ఆందోళనతో పట్టాభి టీడీపీ కార్యాలయంలో దాక్కున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. 


(చదవండి: అభివృద్ధా? అయితే... వద్దట!)

ఈ సందర్భంగా కాకినాడ డీఎస్సీ భీమారావు మాట్లాడుతూ.. కాకినాడలో బోటు దగ్ధం ప్రమాదవశాత్తు జరిగింది. ఆరోజు సాయంత్రం టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా బోటు యాజమానిని పరామార్శించారు.మాజీ ఎమ్మెల్యే ధూళిపాళి నరేంద్ర దగ్ధమైన బోటులో మాదకద్రవ్యాలు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణల పై వారంలోగా ఆధారాలు ఇవ్వాలని ధుళిపాలికి నోటిసు జారీ చేస్తున్నాం’’ అని తెలిపారు. 

చదవండి: అమరావతి టీడీపీలో ముసలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top