‘చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?’ | jogi ramesh on YSRCPs Commitment to OBC Reservation | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు?’

Apr 19 2026 3:53 PM | Updated on Apr 19 2026 4:17 PM

jogi ramesh on YSRCPs Commitment to OBC Reservation

విజయవాడ: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్ష సమావేశం జరిగిందని మాజీమంత్రి జోగి రమేష్ అన్నారు. ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు పెట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ అని చెప్పారు. అసెంబ్లీలో చట్టం చేసిన మొదటి వ్యక్తి వైఎస్‌ జగన్ అని తెలిపారు.

ఓబీసీ రిజర్వేషన్ల కోసం వైసీపీ కట్టుబడి ఉందని జోగి రమేష్‌ తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలమా? వ్యతిరేకమా? అని నిలదీశారు. ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనే ఆలోచన ఉంటే ఈరోజు మీటింగ్‌కు టీడీపీ నేతలు వచ్చుండేవారని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. బీసీలను ఎందుకు మోసం చేస్తున్నారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

బీసీలను మేయర్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లను చేశారని జోగి రమేష్‌ చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులుగా అవకాశం కల్పించారని అన్నారు. రాజ్యసభలో బలహీన వర్గాల వ్యక్తులను అడుగుపెట్టేలా చేశారని తెలిపారు. బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. బీసీలు బలహీనులు కాదని, బలవంతులని నమ్మిన వ్యక్తి వైఎస్‌ జగన్ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement