అయ్యన్నకు మతి భ్రమించింది: జయరాం | Jayaram Comments On Ayyanna Patrudu | Sakshi
Sakshi News home page

అయ్యన్నకు మతి భ్రమించింది: జయరాం

Oct 7 2020 6:09 AM | Updated on Oct 7 2020 6:09 AM

Jayaram Comments On Ayyanna Patrudu - Sakshi

సాక్షి, అమరావతి: ‘పచ్చ’ కళ్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ విమర్శించారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీడీపీ అధికారం కోల్పోయాక మంత్రులుగా పనిచేసిన మాజీలకు పూర్తిగా మతిభ్రమించిందన్నారు. ఆలూరు నియోజకవర్గం వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

నిరాధార ఆరోపణలు  చేస్తే పరువు నష్టం కేసు వేస్తానని మంత్రి హెచ్చరించారు. ఫ్యాక్టరీ పెట్టాలనే తలంపుతో 15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. తరువాత వారి మధ్య విభేదాలు రావడంతో అందులో కొద్దిపాటి భూమిని మాత్రమే మంజునాథ వద్ద తాను కొన్నానని వివరించారు. ఒక బీసీ రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా అని ప్రశ్నించారు. రెండెకరాల చంద్రబాబు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలని నిలదీశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement