వినుకొండ: జగనన్న చేదోడు.. సీఎం జగన్‌ ప్రసంగం హైలైట్స్‌ | Sakshi
Sakshi News home page

జగనన్న చేదోడు.. పల్నాడు వినుకొండ సభలో సీఎం జగన్‌ ప్రసంగం.. హైలైట్స్‌

Published Mon, Jan 30 2023 9:51 AM

Jagananna Chedodu: CM Jagan To Release Aid Vinukonda Updates - Sakshi

Jagananna Chedodu.. అప్‌డేట్స్‌

 జగనన్న చేదోడు పథకం.. మూడో విడత నిధుల జమ కార్యక్రమం ముగియడంతో వినుకొండ నుంచి తిరిగి తాడేపల్లికి బయల్దేరారు సీఎం వైఎస్‌ జగన్‌.

బహిరంగ సభలో ప్రసంగం అనంతరం.. జగనన్న చేదోడు మూడో విడత నిధులను విడుదల చేశారు సీఎం జగన్‌.

సీఎం జగన్‌ ప్రసంగం హైలైట్స్‌

 • నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోంది.
 • వెనకబడిన కులాలను, వర్గాలను.. వెన్నెముక కులాలుగా మారుస్తామని మాట ఇచ్చాం. ఈ మూడు ఏళ్లలో చేసి చూపించాం.
 • లంచాలకు తావులేని వ్యవస్థ ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. వివక్ష లేకుండా పారదర్శకంగా భరోసా అందిస్తున్నాం. 
 • దేశంలోనే జీడీపీ జీఎస్‌డీపీ(గ్రాస్‌ స్టేట్‌ డెమోస్టిక్‌ ప్రొడక్ట్‌)  ప్రకారం.. ఏపీ గ్రోత్‌ రేట్‌ 11.43 శాతంతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 
 • అన్ని వర్గాలు అభివృద్ధి సాధించినప్పుడే.. ఇలాంటి ఫలితం సాధ్యమవుతుంది.
 • ఏపీ శ్రీలంక అయిపోతోందని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, ఏపీ దేశానికే ఓ దిక్సూచిలా నిలుస్తోంది. 
 • సీఎంగా ఓ ముసలాయాన(చంద్రబాబును ఉద్దేశించి) ఉండేవాడు. ఓ గజ దొంగల ముఠా ఉండేది. ఏనాడూ సంక్షేమం గురించి ఆలోచించలేదు. దోచుకోవడం గురించే ఆలోచించింది. 
 • ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు ఏం చేశాడో చూశారు కదా.
 • తోడేళ్లు ఒక్కటవుతున్నా మీ బిడ్డకు భయం లేదు. ఎందుకంటే మీ బిడ్డ ప్రజలను, దేవుడిని నమ్ముకున్నాడు.
 • దోపిడీ పాలన కావాలా? లంచం, అవినీతి లేని పాలన కావాలా? జాగ్రత్తగా ఆలోచించుకుని ఎంచుకోండి. 
 • మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయని.. 


జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.

► అన్నా.. మా నాయీ బ్రాహ్మణుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను గత పది, పన్నెండు ఏళ్ళుగా నా కులవృత్తి చేసుకుంటున్నాను, నా షాప్‌ డెవలప్‌ చేయడం ఎలాగా అనుకునేవాడిని, నాకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్‌ మా ఇంటికి వచ్చి చెబితే నేను నమ్మలేదు, కానీ మాకు అకౌంట్‌లో నేరుగా జమ అయ్యాయి. ఏ లంచం లేకుండా నా అకౌంట్‌లో డబ్బు పడింది. షాప్‌ డెవలప్‌ చేసుకున్నాను, ఇప్పటికి రెండు సార్లు సాయం అందింది, ఇది మూడోసారి నాకు అందుతుంది, మా అమ్మకు ఫించన్‌ వస్తుంది, తెల్లవారగానే వాలంటీర్‌ మా ఇంటికి వచ్చి రూ. 2,750 ఇస్తుంటే మా అమ్మ ఆనందానికి హద్దుల్లేవు. గతంలో చాలా అవస్ధలు పడ్డారు, ఇప్పుడు మా ఇంటికే ఫించన్‌ వస్తుంటే మా అమ్మ సంతోషంగా ఉంది, మా అమ్మ ఒక మాట చెప్పింది, ఇక నుంచి మీరు నన్ను చూసుకోకపోయినా నా పెద్ద కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు, మేం కన్న బిడ్డలమే కానీ మాకంటే మీరే మా తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు. మీరు మా ఇంటిలో పెద్దకొడుకులాగా, మా సొంత అన్నలా ఉంటున్నారు. చేయూత పథకం ద్వారా కూడా లబ్ధిపొందాం, మేం లాక్‌డౌన్‌ టైంలో చాలా ఇబ్బందులు పడితే చేయూత పథకం ద్వారా ఆదుకున్నారు. మాకు చాలా సాయం చేశారు, ధ్యాంక్యూ అన్నా.
:::సైదులు, లబ్ధిదారుడు, కొచ్చర్ల, ఈపూరు మండలం
 

► సాయి కుమారి వినుకొండలో టైలరింగ్‌ వృత్తిలో ఉంది. జగనన్న చేదోడు లబ్ధిదారు ఈమె.  గత రెండు దఫాలు అందిన ప్రభుత్వ సాయంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు అయినట్లు వేదికపై మాట్లాడిందామె.  ఇప్పుడు మూడో విడత సాయంపై సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తనతో పాటు తమ కుటుంబ సభ్యులు జగనన్న ప్రభుత్వంలోలని సంక్షేమ పథకాలతో ఎలా ముందకు వెళ్తోందన్నది వివరించారామె. తనలాంటి వాళ్లెందరికో ఆర్థికంగా ఎదగడానికి సాయం అందిస్తున్న సీఎం జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

► జై జగన్‌ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణం. జగనన్న చేదోడు సాయం.. లబ్ధిదారుల పరిస్థితి ఆర్థికంగా మెరుగుపడడంపై మంత్రి వేణుగోపాల్‌ ప్రసంగించారు. జగనన్న చేదోడు పథకం దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఓ వరం. వాళ్లకు సీఎం జగన్‌ ఇచ్చిన భరోసా. ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి వేణుగోపాల్‌ తెలియజేశారు.

11.42AM
► వినుకొండలో జగనన్న చేదోడు కార్యక్రమం ప్రారంభం. నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన సీఎం జగన్‌కు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు.

11.35AM
► వేదికపై ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీ, మహానేత వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం.. జ్యోతి ప్రజ్వలనతో జగనన్న చేదోడు పథకం మూడో విడత సాయం నిధుల జమ కార్యక్రమం ప్రారంభించారు  సీఎం వైఎస్‌ జగన్‌.

11.25AM
వినుకొండలో జగనన్న చేదోడు పథకం మూడో విడుత నిధుల కార్యక్రమం సందర్భంగా.. వినుకొండ సభా స్థలికి చేరుకున్నారు సీఎం జగన్‌. అక్కడి నేతలు, అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి ఫొటోలు దిగారు.11:20AM
► 
జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి సీఎం వైఎస్‌ జగన్‌ చేరుకున్నారు.

11.10AM
బస్సులో జగనన్న చేదోడు కార్యక్రమ సభాస్థలికి బయల్దేరిన సీఎం జగన్. రోడ్లకిరువైపులా స్వాగతం పలుకుతున్న ప్రజలు. ప్రతిగా అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్‌.11:00AM
► వినుకొండ చేరుకున్న సీఎం జగన్‌
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పల్నాడు జిల్లా వినుకొండకు చేరుకున్నారు. అక్కడ ఆయనకు సాదర స్వాగతం లభించింది. హెలిప్యాడ్ వద్ద మంత్రులు అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజినీలు స్వాగతం పలికారు. స్వాగతలం పలికిన వాళ్లలో.. ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాసు మహేష్ రెడ్డి, కిలారు రోశయ్య, నంబూరి శంకర్ రావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, కలెక్టర్ శివ శంకర్, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కాసేపట్లో జగనన్న చేదోడు నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొంటారు.

10:22 AM
 వినుకొండ బయలుదేరిన సీఎం జగన్

  జగనన్న చేదోడు పథకంలో భాగంగా.. మూడో విడత సాయం నిధుల విడుదల కార్యక్రమం కోసం వినుకొండలో నేడు(సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. 

  జగనన్న చేదోడు పథకం కింద.. దర్జీలు, రజకులు, నాయీబ్రహ్మణులకు రూ.10 వేల సాయం అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మందికి రూ.330. 15 కోట్ల రూపాయలతో లబ్ధి చేకూరనుంది. ఇదిలా ఉంటే.. ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద రూ.927.51 కోట్లు సాయం అందజేసింది జగన్‌ ప్రభుత్వం.

  సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పర్యటనకు భద్రత పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు.. బారికేడింగ్స్ లేకుండా  ఏర్పాట్లు చేసినట్లు తెలిపారాయన. అలాగే.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నామని, వినుకొండ పట్టణంలో వ్యాపార కలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు.

► లంచాలకు, వివక్షకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ అందించాలని తపన పడుతూ..  అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్‌లలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం లబ్ధిని అందజేస్తోంది.   

Advertisement
 
Advertisement
 
Advertisement