దసరా మహోత్సవాలకు సీఎం జగన్‌కు ఆహ్వానం

Invitation To Cm Jagan For Dussehra Celebrations - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు మంగళవారం కలిశారు. త్వరలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎంని ఆహ్వానించారు.

ఈ నెల 15 నుంచి 23 వరకు దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు, ఈ నెల 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు జరగనున్నాయి. సీఎం జగన్‌కి ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వాన పత్రికలను అందించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు పలికారు.
చదవండి: బస్సు యాత్రల్లో జరిగిన మంచిని చెప్పండి: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top