బిర్యానీ ప్యాకెట్లలో బంగారు ముక్కు పుడకలు 

Independent Candidate Giving Gold Ornaments In Biryani Packets Nandyal - Sakshi

నంద్యాల: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఓ అభ్యర్థి ఓటర్లకు గాలం వేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. నంద్యాల పట్టణంలోని 12వ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా ఖండే శ్యాంసుందర్‌లాల్‌ పోటీ చేస్తున్నాడు. ఓటర్లను డబ్బు, బంగారంతో మభ్యపెట్టాలని చూశాడు.  ఎవరికీ అనుమానం రాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కొందరిని కిరాయికి పిలిపించాడు.  మంగళవారం బిర్యాని పొట్లాల్లో ముక్కుపుడకలు ఉంచి ఓటర్లకు పంపిణీ చేయించాడు.

సమాచారం  అందుకున్న పోలీసులు పంపిణీ చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాఘవేంద్రస్వామి, రవికిరణ్, మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద  నుంచి నాలుగు బైకులు,రూ.55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. అభ్యర్థి శ్యామ్‌సుందర్‌లాల్‌తో పాటు మరో ముగ్గురిపై ఎన్నికల నియామావళి అతిక్రమణ కింద కేసు నమోదు చేశారు.    
చదవండి:
బయటకు వెళ్లకుండా తల వ్రెంటుకలను కట్‌ చేయించి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top