Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Huge Devotees Rush At Tirumala Temple | Sakshi
Sakshi News home page

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Aug 19 2024 8:48 AM | Updated on Aug 19 2024 8:48 AM

Huge Devotees Rush At Tirumala Temple

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు 20 కాంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఒక ప్రకటనలో వెల్లడించింది.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, 6 కంపార్ట్ మెంట్లలో టైమ్ స్లాట్ ఎస్ ఎస్ డీ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు 4 గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీవారిని 85,935 మంది భక్తులు దర్శించుకోగా, 31,222మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమలలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement