తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 24 గంటల స‌మ‌యం | Huge Devotees Rush At Tirumala Temple | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ.. ద‌ర్శ‌నానికి 24 గంటల స‌మ‌యం

Aug 11 2024 7:51 AM | Updated on Aug 11 2024 8:17 AM

Huge Devotees Rush At Tirumala Temple

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది.  ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATGH వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు . శనివారం అర్ధరాత్రి వరకు 79,313  మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో  39,344  మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 6  గంటల సమయం.

దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 24 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలలో అనుమతించారని స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement