Rain Alert: ఏపీలో భారీ వర్షాలు | Heavy Rain Forecast In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

Rain Alert: ఏపీలో భారీ వర్షాలు

Nov 3 2021 7:58 AM | Updated on Nov 3 2021 7:58 AM

Heavy Rain Forecast In Andhra Pradesh - Sakshi

తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ రాగల 36 గంటల్లో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.

సాక్షి, విశాఖపట్నం/అమరావతి: తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ రాగల 36 గంటల్లో మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు కొమరిన్, శ్రీలంక పరిసర ప్రాంతాల మీదుగా మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. (చదవండి: Kodi Rammurthy Naidu: తెరపైకి కలియుగ భీముడు)

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈ జిల్లాల పరిధిలో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. 4, 5 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
(చదవండి: బద్వేలు బ్లాక్‌ బస్టర్‌)

Advertisement
 
Advertisement
Advertisement