
ఫైల్ ఫొటో
గతంలో అభివృద్ధి పనులను అడ్డుకునే ఉద్దేశంతో.. కోర్టుతో అక్షింతలు..
సాక్షి, గుంటూరు: ఇప్పటంలో రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్రహరీ గోడలను తొలగించే పనులను చేపట్టారు. గతంలో ఈ అభివృద్ధిని అడ్డుకునే ఉద్దేశంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే..
ఈ వ్యవహారానికి సంబంధించి కోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయడంతో వాళ్లకు చెందిన ప్రహరీ గోడలు తొలగింపు పనులు అధికారులు ఇవాళ ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. గతంలో తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు 14 మందికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించిన ఏపీ హైకోర్టు.