ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత శతాబ్ధి ఉత్సవాలు | Gunadala Mary Matha Utsav from today | Sakshi
Sakshi News home page

ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత శతాబ్ధి ఉత్సవాలు

Feb 9 2024 8:08 AM | Updated on Feb 9 2024 8:17 AM

Gunadala Mary Matha Utsav from today - Sakshi

గుణదల/రైల్వేస్టేషన్‌(విజయవాడ తూర్పు/పశ్చిమ): క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన గుణదల మేరీమాత ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి సమిష్టి దివ్యబలి పూజతో ఉత్సవాలను బిషప్ తెలగ తోటి రాజారావు ప్రారంభించారు. ఉత్సవాల్లో ఫాదర్స్,క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు.

ఈనెల 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ తిరునాళ్లకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యార్ధం పుణ్యక్షేత్రంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

కొండ దిగువన ఉన్న బిషప్‌ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో తొలి సమి ష్టి దివ్యబలి పూజతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. పలు ప్రభుత్వ శాఖ­ల అధికారు ల సహకారంతో పుణ్యక్షేత్ర గురువులు తిరునాళ్ల ను సజావుగా ని ర్వహించను న్నా రు. భక్తు లు లక్షలాదిగా తరలి వచ్చి మరియమాతను దర్శించుకుని దీవెనలు పొందాలని గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. 

ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక స్టాపేజ్ కేటాయించింది దక్షిణమధ్య రైల్వే. రామవరప్పాడులో నాలుగు రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్‌కు అనుమతి ఇచ్చింది.  ఈ నాలుగు రైళ్లు భక్తుల సౌకర్యార్ధం నిమిషం పాటు  తాత్కాలిక స్టాపేజ్‌లో ఆగనున్నాయి.

నాలుగు రైళ్లకు రామవరప్పాడులో నిమిషం హాల్టింగ్‌ 
ఈ ఉత్సవాల కోసం రైల్వేశాఖ నేటి నుంచి మూడు రోజులపాటు రామవరప్పాడు రైల్వేస్టేషన్‌లో పలు రైళ్లకు ఒక నిమిషం హాలి్టంగ్‌ సదుపాయం కల్పించింది. పూరి–తిరుపతి (17479), బిలాస్‌పూర్‌–తిరుపతి (17481) ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు మధ్యాహ్నం 12.04 గం.లకు రామవ­రప్పాడు చేరుకుని 12.05 గం.లకు బయలుదేరతాయి. తిరుపతి–పూరి (17480), తిరుపతి–బిలాస్‌పూర్‌ (17482) రైళ్లు సాయంత్రం 6.44 గం.­లకు రామవరప్పాడు చేరుకుని, తిరిగి 6.45 గం.లకు బయలుదేరతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement