breaking news
Mary Matha
-
సర్వమతాల భక్తులు కొలిచే సాగర్ మాత
సర్వ మతాల భక్తుల కోర్కెలు తీర్చే క్షేత్రంగా వెలుగొందుతోంది సాగర్ మాత ఆలయం. ఈ ఆలయం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం తీరంలో ఉంది. సాగర్మాత మహోత్సవాలను ఏటా మార్చి 7, 8, 9 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా పలు రాష్ట్రాల నుంచి భక్తులు హాజరవుతారు. విదేశీయులు సైతం ఈ ఉత్సవాలకు హాజరుకావడం విశేషం. ఉత్సవాల సమయంలోనే కాకుండా.. ప్రతి ఆదివారం భక్తులు ఆలయానికి వస్తుంటారు.ప్రముఖ పుణ్యక్షేత్రమైన సాగర్మాత (Sagar Matha) ఆలయానికి రాష్ట్రంలోనే విశిష్టత ఉంది. భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా మందిర నిర్మాణం, గోపురంపై విగ్రహ సంపద రూపుదిద్దుకున్నాయి. భారతీయ చిత్రకళా నైపుణ్యం వీటిలో కనిపిస్తుంది. సాగర్ ఒడ్డున వెలిసిన మేరీమాత.. సాగర్మాత పేరుతో క్రైస్తవులతో పాటు హిందువులు, ముస్లింలు తదితర అన్ని మతాల నీరాజనాలను అందుకుంటోంది. భారతీయ సంప్రదాయ రీతుల్లో నిర్మాణం ఈ ఆలయం దేశంలోనే భారతీయ సంప్రదాయ రీతులలో నిర్మించిన తొలి క్రైస్తవ మందిరంగా చెబుతారు. ధూప, దీప, నైవేద్యాలు, తలనీలాలు సమర్పించటం వంటి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమాలన్నీ పూర్తిగా హిందూ పద్ధతిలో జరిగే క్రైస్తవ ఆలయం కావడం విశేషం. కోర్కెలు తీరిన భక్తులు జీవాలను బలి ఇస్తారు. సాగర తీరంలో వంటలు చేసుకొని ఆరగించి వెళ్తారు. సాగర్లో పయనించే నావికుడు.. రాత్రి వేళల్లో నక్షత్రాల సహాయంతో ఓడను నడిపి గమ్యస్థానం చేరినట్లు.. పాపపంకిలమైన లోకమనే సముద్రంలో మానవునికి మంచి అనే దారి చూపేందుకు మరియమాత నక్షత్రంగా ప్రకాశిస్తుందని.. భక్తులు చెబుతారు. ఆ నమ్మకంతోనే దీనికి సాగర్మాత మందిరం అని పేరు పెట్టారు. చదవండి: ఈ చిన్నారి పేరు దేశమంతా మారుమోగిపోతోంది!ఈ మందిరానికి 1977 అక్టోబర్ 10వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అప్పటి గుంటూరు మండల పీఠాధిపతి కాగితపు మరియదాసు ప్రారంభోత్సవం చేశారు. దీని నిర్మాణానికి మరియదాసుతో పాటు ముమ్మడి ఇగ్నేషియన్, తాను గుండ్ల బాలశౌరి విశేష కృషి చేశారు.ఆకట్టుకుంటున్న జపమాల స్థలాలు 2011 మార్చి 6న కృష్ణానదీ (Krishna River) తీరంలో నిర్మించిన జపమాల క్షేత్రాన్ని గుంటూరు పీఠాధిపతులు గాలిబాలి ప్రారంభోత్సవం చేశారు. ఏసుక్రీస్తు జననం నుంచి మరణం వరకు ఆయన జీవిత చరిత్ర గురించి ఏర్పాటు చేసిన 20 జపమాల స్థలాలు, ధ్యానమందిరం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. 2024లో సాగర్మాత ఆలయంపై, ఆలయంలోని 14 స్థలాల విగ్రహాలపై దేవదూతల విగ్రహాలను విచారణ గురువులు హృదయ్కుమార్ ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగర్మాతకు కొబ్బరికాయ కొట్టి అగర్బత్తీల హారతి, తలనీలాలు సమర్పించుకొని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. పుణ్యస్నానాలు చేసి ప్రార్థనలు జరుపుతారు. -
ఘనంగా ప్రారంభమైన గుణదల మేరీమాత శతాబ్ధి ఉత్సవాలు
గుణదల/రైల్వేస్టేషన్(విజయవాడ తూర్పు/పశ్చిమ): క్రైస్తవ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన గుణదల మేరీమాత ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి సమిష్టి దివ్యబలి పూజతో ఉత్సవాలను బిషప్ తెలగ తోటి రాజారావు ప్రారంభించారు. ఉత్సవాల్లో ఫాదర్స్,క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈనెల 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ తిరునాళ్లకు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. వీరి సౌకర్యార్ధం పుణ్యక్షేత్రంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. కొండ దిగువన ఉన్న బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో తొలి సమి ష్టి దివ్యబలి పూజతో ఈ ఉత్సవాలు మొదలవుతాయి. పలు ప్రభుత్వ శాఖల అధికారు ల సహకారంతో పుణ్యక్షేత్ర గురువులు తిరునాళ్ల ను సజావుగా ని ర్వహించను న్నా రు. భక్తు లు లక్షలాదిగా తరలి వచ్చి మరియమాతను దర్శించుకుని దీవెనలు పొందాలని గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాత్కాలిక స్టాపేజ్ కేటాయించింది దక్షిణమధ్య రైల్వే. రామవరప్పాడులో నాలుగు రైళ్లకు తాత్కాలిక స్టాపేజ్కు అనుమతి ఇచ్చింది. ఈ నాలుగు రైళ్లు భక్తుల సౌకర్యార్ధం నిమిషం పాటు తాత్కాలిక స్టాపేజ్లో ఆగనున్నాయి. నాలుగు రైళ్లకు రామవరప్పాడులో నిమిషం హాల్టింగ్ ఈ ఉత్సవాల కోసం రైల్వేశాఖ నేటి నుంచి మూడు రోజులపాటు రామవరప్పాడు రైల్వేస్టేషన్లో పలు రైళ్లకు ఒక నిమిషం హాలి్టంగ్ సదుపాయం కల్పించింది. పూరి–తిరుపతి (17479), బిలాస్పూర్–తిరుపతి (17481) ఎక్స్ ప్రెస్ రైళ్లు మధ్యాహ్నం 12.04 గం.లకు రామవరప్పాడు చేరుకుని 12.05 గం.లకు బయలుదేరతాయి. తిరుపతి–పూరి (17480), తిరుపతి–బిలాస్పూర్ (17482) రైళ్లు సాయంత్రం 6.44 గం.లకు రామవరప్పాడు చేరుకుని, తిరిగి 6.45 గం.లకు బయలుదేరతాయి. -
గుణదల మేరీ మాత తిరునాళ్లు (ఫొటోలు)
-
నేటి నుంచి గుణదలలో మేరీమాత నవదిన ప్రార్థనలు
సాక్షి, విజయవాడ: క్రైస్తవ ఆధ్యాత్మిక శిఖరంగా వెలుగొందుతున్న గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో నేటి(శుక్రవారం) నుంచి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు క్యాథలిక్ పీఠం బిషప్ కలగతోటి రాజారావు తెలిపారు. గుణదల మేరీ మాత నవదిన ప్రార్థనలు ప్రారంభమయిన సందర్బంగా పుణ్యక్షేత్ర ఆవరణంలో పతాకం ఆవిష్కరణ చేసి లాంఛన ప్రాయంగా ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పుణ్యక్షేత్ర గురువులు దివ్య సత్పసాద ఆరాధనతో కొండపై ఉన్న మేరీమాత గృహ వద్దకు చేరుకుని.. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిని బలిపీఠం వద్ద సమిష్టి దివ్యబలి పూజ సమర్పణ చేశారు. ముదటి రోజు క్రైస్తవ విశ్వాసులు ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జనసంద్రమైన గుణదల పుణ్యక్షేత్రం