కోవిడ్‌ వైద్యం: కీలక జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం | Govt Issued New GO On Corona Treatment | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ వైద్యం: కీలక జీవో జారీచేసిన ఏపీ ప్రభుత్వం

May 7 2021 9:58 PM | Updated on May 7 2021 10:15 PM

Govt Issued New GO On Corona Treatment - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వైద్యానికి మరో కీలక జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో 50శాతం బెడ్లను కోవిడ్‌ పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు, ఎంప్యానెల్‌ జాబితాలోని ఆస్పత్రుల్లో బెడ్లు కేటాయించాలని ప్రభుత్వం సూచించింది. ఎంప్యానెల్‌ కానీ ఆస్పత్రులను తాత్కాలిక ఎంప్యానెల్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వాటిలోనూ 50శాతం బెడ్లు కోవిడ్‌ ఉచిత, నగదు రహిత వైద్యం పొందే పేషెంట్లకు కేటాయించాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది.

జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తక్షణమే 50 శాతం బెడ్లను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించింది. ఆస్పత్రుల్లో ఇంకా బెడ్లు మిగిలిఉంటే కోవిడ్‌ పేషంట్లకు ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు. ఆరోగ్యమిత్ర, నోడల్‌ ఆఫీసర్ల పరిధిలోకి బెడ్లు తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏ కోవిడ్‌ పేషంట్‌ను ఆస్పత్రిలో అడ్మిషన్‌ నిరాకరించరాదని ప్రభుత్వం పేర్కొంది. కచ్చితంగా డాక్టరు అడ్మిషన్‌ సూచించిన వారిని చేర్చుకోవాలని ఆదేశించారు.

చదవండి: కఠిన చర్యలు తీసుకుంటే థర్డ్‌ వేవ్‌ రాకపోవచ్చు: విజయరాఘవన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement