పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు | Goods Train Derails Near Manubolu Nellore | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

Apr 1 2026 5:32 AM | Updated on Apr 1 2026 5:32 AM

Goods Train Derails Near Manubolu Nellore

మనుబోలు: విజయవాడ డివిజన్‌ నెల్లూరు–గూడూరు సెక్షన్‌ పరిధిలో మనుబోలు మండలంలోని కొమ్మరపూడి రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం ఉదయం పాల ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న గూడ్స్‌ రైలు కొమ్మలపూడి సమీపంలోని 152/11 కి.మీ. వద్ద పట్టాలు తప్పింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మరో మార్గంలో రైళ్ల రాకపోకలను కొనసాగించారు. మధ్యాహ్నం 2 గంటలకు రాకపోకలను పునరుద్ధరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement