ఇంటింటా సంక్షేమ కాంతులు | Gadapa Gadapaki Mana Prabhutvam Success Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇంటింటా సంక్షేమ కాంతులు

Aug 28 2022 4:29 AM | Updated on Aug 28 2022 8:40 AM

Gadapa Gadapaki Mana Prabhutvam Success Andhra Pradesh - Sakshi

పశ్చిమగోదావరి జిల్లా పైడిపర్రులో లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి కారుమూరి

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రతి ఇంటివద్దా ప్రజలు ఆనందంతో స్వాగతం పలుకుతున్నారు. ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాలనలో ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తోందని చెబుతున్నారు.

అన్ని జిల్లాల్లోనూ శనివారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను అక్కడికక్కడే  పరిష్కరించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement