వాడవాడలా వేడుకగా..  | Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP | Sakshi
Sakshi News home page

వాడవాడలా వేడుకగా.. 

Oct 16 2022 5:50 AM | Updated on Oct 16 2022 6:00 AM

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP - Sakshi

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిలకపాడులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తోన్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఓ వైపు వర్షం కురుస్తున్నా అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవించారు.  

Advertisement
 
Advertisement
Advertisement