సంక్షేమాభివృద్ధికి సలాం | Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP | Sakshi
Sakshi News home page

సంక్షేమాభివృద్ధికి సలాం

Oct 11 2022 5:14 AM | Updated on Oct 11 2022 5:14 AM

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP - Sakshi

చిలకలూరిపేటలో మహిళకు సంక్షేమ పథకాల లబ్ధి గురించి వివరిస్తున్న మంత్రి విడదల రజిని

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సోమవారం ఉత్సాహంగా కొనసాగింది. గ్రామ గ్రామానా ప్రజలు ఎదురేగి నాయకులకు స్వాగతం పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తమ ఇంటికి వచ్చి సమస్యల గురించి అడుగుతుండటంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

కొన్ని సమస్యల పరిష్కారం కోసం నాయకులు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలనలో తమకు అందిన సంక్షేమ పథకాలపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తంచేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 95 శాతం హామీలను అమలు చేసిందని, రానున్న కాలంలో మరింత లబ్ధి చేకూరుస్తుందని నాయకులు వివరించారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement