గడప గడపలో ఘన స్వాగతం | Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP | Sakshi
Sakshi News home page

గడప గడపలో ఘన స్వాగతం

Aug 21 2022 5:02 AM | Updated on Aug 21 2022 10:53 AM

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP - Sakshi

ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్‌ యాదవ్‌

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. అన్ని జిల్లాల్లో శనివారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement