మీ ఇంటికి వచ్చాం.. సమస్యలుంటే చెప్పండి  | Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP | Sakshi
Sakshi News home page

మీ ఇంటికి వచ్చాం.. సమస్యలుంటే చెప్పండి 

Jul 22 2022 4:57 AM | Updated on Jul 22 2022 8:18 AM

Gadapa Gadapaki Mana Prabhutvam Success All Over AP - Sakshi

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, నెట్‌వర్క్‌: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఘన స్వాగతం చెబుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ గురువారం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ‘మీ ఇంటి వద్దకే వచ్చాం.. సమస్యలేమైనా ఉంటే చెప్పండి’ అని ప్రజల్ని అడిగారు.

తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ వెంటే తామంతా నడుస్తామని ప్రజాప్రతినిధులతో ప్రజలు చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు.  

Advertisement
 
Advertisement
Advertisement