మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూత

Former MLA Kudupudi Chittabbai Passed Away - Sakshi

చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించిన సీఎం జగన్‌

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: బీసీ నేత, మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి కన్నుమూశారు. కాకినాడ ప్రైవేట్‌ ఆస్పత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. చిట్టబ్బాయి కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. చిట్టబ్బాయి మృతితో కోనసీమలో తీవ్ర విషాదం అలుముకుంది.

కుడిపూడి చిట్ట‌బ్బాయి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షుడు, అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు చిట్టబ్బాయి మృతి ప‌ట్ల సంతాపం ప్రకటించారు.

ధర్మాన ప్రసాదరావు సంతాపం..
కుడిపూడి చిట్టబ్బాయి మరణం చాలా బాధాకరమని ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. చిట్టబ్బాయి మృతి పట్ల ఆయన సంతాపం వ్యక్తం చేశారు. చిట్టబ్బాయి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చదవండి: దారుణం: తల్లి, ఇద్దరు పిల్లల హత్య
మాస్క్‌ పెట్టుకోమన్నందుకు కార్పొరేటర్‌పై దాడి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top