మాజీ మంత్రి ఆదికి హైకోర్టులో ఎదురుదెబ్బ   | Former Minister Adinarayana Reddy Has Faced Backlash In High Court | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి ఆదికి హైకోర్టులో ఎదురుదెబ్బ  

Aug 12 2020 8:08 AM | Updated on Aug 12 2020 8:08 AM

Former Minister Adinarayana Reddy Has Faced Backlash In High Court - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకున్న 1+1 భద్రతను తొలగించడాన్ని సమర్థిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రాణహాని లేనప్పుడు భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్న సింగిల్‌ జడ్జి తీర్పును సమర్థించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఆదినారాయణరెడ్డి దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది.   (విజయవాడ ఘటనపై స్పందించరేం బాబూ?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement