ప్రైవేట్‌ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం

Published Sun, May 19 2024 7:22 AM

Fire Broke Out In Private Travels At Renigunta Tirupati

సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో ఓ ప్రైవేటు ట్రవెల్స్‌  బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గరేణిగుంట మండలం, వెదళ్ళ చెరువు వద్ద ప్రైవేటు  ట్రావెల్స్  బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మార్నింగ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.  సమాచారం అందుకున్న  పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో బస్సులో మంటలను అదుపు చేయించారు. అప్పటికే బస్సు  పూర్తిగా  కాలిపోయింది.

 

బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో 12 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను స్థానిక పోలీసులు చొరవ తీసుకొని గమ్యస్థానాలకు పంపారు. ఈ ఘటనపై రేణిగుంట అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


 

Advertisement
 
Advertisement
 
Advertisement