విశాల్ మార్ట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

సాక్షి, విజయనగరం: నగరంలోని విశాల్ మార్ట్‌లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తులో చెలరేగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాప్తి చెందాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్ని ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.
కాగా, మార్ట్‌లో బట్టలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో మంటల భారీగా వ్యాపించాయి. ఇక, అగ్ని ప్రమాదం కారణంగా కలెక్టరేట్ రోడ్‌లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు ఫైర్ ఇంజన్లు ఘటన స్థలంలో మంటలను అదుపులోకి తెస్తున్నట్టు సమాచారం. అయితే, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మార్ట్ మూసివేసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.