టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702

Farmer TDP MP family Benefit with YSRCP Govt Welfare schemes - Sakshi

సాక్షి, నాయుడుపేట టౌన్‌ (తిరుపతి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి  సంక్షేమ పథకాల ద్వారా రూ.45,702 లబ్ధి చేకూరింది.

వైఎస్సార్‌ ఆసరా ద్వారా 2020–21, 2021–22లకు రూ.17,261 చొప్పు­న, సున్నా వడ్డీ కింద 2020లో రూ.2,628, 2021లో రూ.1,575, 2022లో రూ.1,112 నగదు అమృతసరళ బ్యాంక్‌ ఖాతాలో ప్రభు­త్వం జమ చేసింది. పంట రుణాల సున్నా వడ్డీ నగదును రెండు విడతలుగా రూ.5,865 నెలవల బ్యాంక్‌ ఖాతాలో వేసింది. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంక్షేమ పథకాల బుక్‌లెట్‌ను నాయుడుపేటలో నెలవలకు అందజేశారు. 

చదవండి: (తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఈవో ధర్మారెడ్డి క్లారిటీ)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top