‘సింహాద్రి’లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత  | Sakshi
Sakshi News home page

‘సింహాద్రి’లో విద్యుత్‌ ఉత్పత్తి నిలిపివేత 

Published Sun, May 28 2023 4:14 AM

Electricity production stopped in Simhadri - Sakshi

పరవాడ(అనకాపల్లి జిల్లా): సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్‌లో 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండో యూనిట్‌లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్‌ సరఫరాకు తగినంత డిమాండ్‌ లేని కారణంగా (రిజర్వు షట్‌డౌన్‌) రెండో యూనిట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేశారు.

విద్యుత్‌కు తగినంత డిమాండ్‌ లేకపోవడం వల్ల శుక్రవారం ఉదయం సంస్థలో 3, 4 యూనిట్లలో ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మొదటి యూనిట్‌ నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది.

అవసరాలను బట్టి 2, 3, 4 యూనిట్ల నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. అయితే, విద్యుత్‌ ఉత్పత్తికి డిమాండ్‌ లేని కారణంగా మొదటి యూనిట్‌ను కూడా త్వరలో తాత్కాలికంగా నిలిపివేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Advertisement
Advertisement