
ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్న విద్యుత్ జేఏసీ నాయకులు
కదంతొక్కిన విద్యుత్ ఉద్యోగులు
దద్దరిల్లిన ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఏలూరు నగరాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తిరుపతి రూరల్/ఏలూరు (టూటౌన్): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగులు సోమవారం నిర్వహించిన ర్యాలీలతో ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఏలూరు నగరాలు దద్దరిల్లాయి. వందలాదిమంది ఉద్యోగులు ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్లలో వినతిపత్రాలు సమరి్పంచారు. రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు దశల వారీ ఆందోళనలో భాగంగా సోమవారం ఈ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాటా్లడుతూ విద్యుత్ ఉద్యోగులకు, పెన్షనర్లకు, వారి కుటుంబసభ్యులకు పూర్తి వైద్య ఖర్చులు చెల్లించాలని కోరారు.
జీపీఎఫ్‌తో కూడిన పెన్షన్ నిబంధనలను 01.02.1999 నుంచి 31.08.2004 వరకు నియమించిన ఉద్యోగులందరికీ వర్తింపజేయాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 2023 ఆగస్టులో విద్యుత్ సంఘాలతో రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రకారం యాజమాన్యమే నేరుగా వేతనాలు చెల్లించాలన్నారు. పదేళ్ల స ర్విసు దాటిన వారందరికీ 2018 రివిజన్‌లో మంజూరు చేసిన స ర్విస్ ఇన్సెంటివ్‌ను పునరుద్ధరించాలని కోరారు.
పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఒంగోలులో విద్యుత్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు ఉద్యోగులు కదం తొక్కారు.
తిరుపతిలో బైక్‌లతో ర్యాలీ
తిరుపతిలో విద్యుత్ సర్కిల్ ఆఫీసు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు మోటార్ బైక్‌లతో ర్యాలీ చేశారు. జేసీ శుభంబన్సల్‌కు వినతిపత్రం ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని వందలాదిమంది ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఏలూరులో విద్యుత్ ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం ఇచ్చారు.