ఏపీలో 3 రాజ్యసభ సీట్ల ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల | EC Released Schedule for 3 AP Rajya Sabha Seats Bye Elections | Sakshi
Sakshi News home page

ఏపీలో 3 రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

Nov 26 2024 2:33 PM | Updated on Nov 26 2024 3:35 PM

EC Released Schedule for 3 AP Rajya Sabha Seats Bye Elections

న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ సీట్ల ఉప ఎన్నికకు మంగళవారం షెడ్యూల్‌ విడుదలైంది. డిసెంబర్‌ 3వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల అవుతుందని, 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 20వ తేదీన పోలింగ్‌ జరుగుతుందని ఎన్నికల సంఘం అందులో పేర్కొంది.

వైఎస్సార్‌సీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ ఎంపీల రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఏపీతో పాటు ఒడిశా, వెస్ట్‌ బెంగాల్‌, హర్యానాలో  ఒక్కో స్థానానికి కూడా(రాజీనామాలే) ఈ నోటిఫికేషన్‌ వర్తించనుంది. 

డిసెంబర్‌ 20వ తేదీనే పోలింగ్‌ అయ్యాక సాయంత్రం కౌంటింగ్‌, ఫలితాల వెల్లడి ఉంటుందని ఈసీ ఆ షెడ్యూల్‌లో పేర్కొంది. మిగతా వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చూడొచ్చు. 

ఇదీ చదవండి: హాయ్‌ చెప్తే.. అంత డ్రామా చేస్తారా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement