భీమవరం: విచ్చలవిడి మద్యం విక్రయాలతో మందుబాబులే కాకుండా మహిళలు మద్యం సేవించి ఒళ్లు తెలియకుండా రోడ్ల మీద పడిపోతున్నారు. మంగళవారం రాత్రి భీమవరం రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఒక యువతి ఫుల్‌గా మద్యం తాగి రోడ్డుకు అడ్డుగా పడుకుని హల్‌చల్ చేసింది. ఫ్లైఓవర్‌పై అడ్డంగా పడుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆ యువతికి వాహనదారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు.