మద్యంపై సిండికేట్‌ బాదుడు | - | Sakshi
Sakshi News home page

మద్యంపై సిండికేట్‌ బాదుడు

Feb 10 2026 8:16 AM | Updated on Feb 10 2026 8:16 AM

మద్యం

మద్యంపై సిండికేట్‌ బాదుడు

న్యూస్‌రీల్‌

కనిపించని రూ.99 క్వార్టర్‌

మంగళవారం శ్రీ 10 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026

సాక్షి, భీమవరం: ఎకై ్సజ్‌ శాఖ ప్రకటనలకు క్షేత్రస్థాయిలో మద్యం ధరలకు పొంతన ఉండటం లేదు. జిల్లాలో ఎమ్మార్పీ నిబంధనలు అమలవుతున్న దాఖలాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం బాటిల్‌పై రూ.10 చొప్పున ఏడాది వ్యవధిలో రెండు పర్యాయాల్లో రూ.20 పెంచితే లిక్కర్‌ వ్యాపారులు అదనంగా మరో రూ. 10 పెంచి అమ్మకాలు చేస్తున్నారు. బీర్లపై రూ.20 చొప్పున వసూలు చేస్తూ మందుబాబుల జేబులు గుల్ల చేస్తున్నారు.

మందుబాబులపై మార్జిన్‌ భారం

జిల్లాలో 194 మద్యం దుకాణాలు ఉన్నాయి. గతంలో మద్యం అమ్మకాలపై వ్యాపారులకు పది శాతం మార్జిన్‌ ఉండేది. లిక్కర్‌ సిండికేటుకు మేలు చేస్తూ గత ఫిబ్రవరిలో 14 శాతంకు పెంచిన ప్రభుత్వం తాజాగా జనవరిలో 15 శాతం చేసింది. బార్లలో మద్యం అమ్మకాలపై ఉన్న 15 శాతం అదనపు రిటైల్‌ ఎకై ్సజ్‌ సుంకాన్ని (ఏఆర్‌ఈటీ)ని పూర్తిగా రద్దుచేసింది. వ్యాపారులకు మార్జిన్‌ పెంపు ప్రభావం ప్రభుత్వ ఆదాయంపై పడకుండా ఆ భారాన్ని మందుబాబులపై మోపుతోంది. గతంలో మార్జిన్‌ పెంచినప్పుడు బాటిల్‌పై రూ.10 పెంచినట్టే, మళ్లీ ఇప్పుడు మరో రూ.10 పెంచింది. పేద, మధ్యతరగతి వర్గాల వారు ఎక్కువగా కొనుగోలు చేసే రూ.120, రూ.130, రూ. 150, రూ.180, రూ.190 క్వార్టర్‌ బాటిళ్ల ధరలు ఏడాదికాలంలో రూ.20 చొప్పున పెరిగిపోయాయి. మద్యం ధరలు తగ్గిస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చేసరికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తోందని మందుబాబులు మండిపడుతున్నారు.

సిండికేటు సెప‘రేటు’

జిల్లాలో రోజుకు దాదాపు రూ.4 కోట్ల విలువైన రెండు వేలకు పైగా లిక్కర్‌ కేస్‌లు, 600 వరకు బీరు కేస్‌లు అమ్మకాలు జరుగుతాయని అంచనా. లిక్కర్‌ కేస్‌లో క్వార్టర్‌ బాటిళ్లు 48, హాఫ్‌ బాటిళ్లు 24, ఫుల్స్‌ 12 చొప్పున ఉంటాయి. బీర్లు 12 వరకు ఉంటాయి. ఈ మేరకు ప్రతి బాటిల్‌పైనా రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు. ధరలు పెంచకుండా మినహా యింపు ఇచ్చిన రూ.99 క్వార్టర్‌, బీరు, వైన్‌, రెడీ టూ డ్రింక్‌ బాటిళ్లపైనా ఎమ్మార్పీపై రూ.10 నుంచి రూ. 20 వరకు అదనంగా అమ్మకాలు చేస్తున్నారంటున్నారు. బెల్టుషాపుల్లో రూ.40 నుంచి రూ.50 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. అనధికారకంగా మందుబాబుల నుంచి రోజుకు సుమారు రూ.10 లక్షలు పైనే వసూలు చేస్తున్నట్టు అంచనా. ఏడాదిక్రితంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్‌ బాదుడుతో బాటిల్‌పై రూ.30 అదనంగా పెరిగిందని మద్యపాన ప్రియులు వాపోతున్నారు. ఎమ్మార్పీ ధరల పట్టికలు ఏర్పాటుచేసినట్టు అధికారులు చెబుతుండగా అవి ఎక్కడా కనిపించడం లేదంటున్నారు. అమ్మకాలు పెంచాలంటూ ప్రభుత్వం తెస్తున్న ఒత్తిడితో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బాటిల్‌కు రూ. 10,బీరుపై రూ.20 వరకు పెంపు

కనిపించని ధరల పట్టికలు

బెల్టుల్లో సెప‘రేటు’ దందా

జిల్లాలో ధరల దోపిడీ రోజుకు రూ.10 లక్షల పైమాటే

ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరిగేలా మద్యం దుకాణాల వద్ద డెకాయి ఆపరేషన్లు చేస్తున్నాం. కొత్త ధరల పట్టికను, 14405 టోల్‌ఫ్రీ నెంబర్‌ను అన్ని మద్యం దుకాణాల వద్ద ప్రదర్శిస్తున్నాం. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు మద్యం అమ్మకాలు చేస్తున్న ఐదు షాపులపై కేసులు నమోదుచేశాం. బెల్టు షాపులపై దాడులుచేసి 698 కేసులు నమోదుచేశాం. 702 మందిని అరెస్టుచేసి 1183 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం.

– జిల్లా మద్యనిషేధ అబ్కారీశాఖ అధికారి ప్రకటన

పేద మందుబాబుల కోసం అంటూ చంద్రబాబు ప్రకటించిన రూ.99 క్వార్టర్‌ బాటిళ్లు మద్యం దుకాణాల్లో కనిపించడం లేదు. ఒకటీ అరా కేసులు షాపుల్లో విక్రయించి చాలా వరకు బెల్టులకు తరలించేస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ వీటిని రూ.140 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేస్తున్నారు. మద్యం షాపుల్లో అమ్మకాలు చేసే బాటిళ్లతో పోలిస్తే బెల్టుషాపుల్లో విక్రయించే మద్యం బాటిళ్ల మూతలపై ప్రత్యేక స్టిక్కర్లు ఉంటుండటం గమనార్హం. జిల్లాలోని పాలకొల్లుతో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల కల్తీ మద్యం తయారీ ఘటనలు వెలుగుచూడటంతో బెల్టుషాపుల్లో మద్యం నాణ్యతపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మద్యంపై సిండికేట్‌ బాదుడు1
1/2

మద్యంపై సిండికేట్‌ బాదుడు

మద్యంపై సిండికేట్‌ బాదుడు2
2/2

మద్యంపై సిండికేట్‌ బాదుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement