గూడెంలో జనసేనకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

గూడెంలో జనసేనకు షాక్‌

Feb 10 2026 8:16 AM | Updated on Feb 10 2026 8:16 AM

గూడెంలో జనసేనకు షాక్‌

గూడెంలో జనసేనకు షాక్‌

గూడెంలో జనసేనకు షాక్‌

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలంలో జనసేన పార్టీకి షాక్‌ తగిలింది. మారంపల్లిలో జనసేన, టీడీపికి చెందిన 25 మంది సోమవారం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ వడ్డి రఘురాం సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మారంపల్లి జనసేన పార్టీ అధ్యక్షుడు మంగిన బాలాజీ( బాలు) తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని కండువాలు వేసి ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్టు బాలు చెప్పారు. రఘురాం మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు సముచిత స్ధానం ఉంటుందన్నారు. మిద్దే శివ, మేకా సాయి, కారింకి దుర్గాప్రసాద్‌, కనపర్తి సురేష్‌, కనపర్తి వెంకన్న, ఆదిరెడ్డి దుర్గారావు, పసలపూడి నాగేశ్వరరావు, సుంకర చంద్రశేఖర్‌, కొండపల్లి కనకం, ఇందుకూరి శ్రీనివాసరాజు, సారిక సత్యనారాయణ, ఉత్తరవల్లి నాగు, నందమూరు మాజీ సర్పంచ్‌ కోనేటి దానయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement