కొవ్వు లేదని తేల్చి చెప్పినా దుష్ప్రచారమా?
యువతిపై కత్తితో దాడి
వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి పెళ్లిచేసుకోవాలని వేధిస్తూ యువతిపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం నూజివీడు పట్టణంలో జరిగింది. 8లో u
పెనుగొండ: తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిట్ తేల్చి చెప్పినా చంద్రబాబు ఇంకా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు విమర్శించారు. సోమవారం తూర్పుపాలెంలో విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ప్రసాదాలకు లింకులు పెడుతున్నారని దుయ్యబట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బ కొట్టి, వాటిని పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పైకి మరల్చడానికి విఫలయత్నం చేస్తున్నారన్నారు. లడ్డూలో పంది కొవ్వు, ఇతర జంతువుల కొవ్వూ అంటూ చేసిన దుష్ప్రచారం వారి మెడకే చుట్టుకొందన్నారు. ప్రసాదాలు సంప్రదాయ పద్ధతిలో ఆయా ఆలయాల్లో సంబంధీకులు చేస్తారని, చైర్మన్లకు, సీఎంలకు సంబందం ఉండదన్నారు. చంద్రబాబు జగన్‌మోహన్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడానికే ప్రాధాన్యత నిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత, లోకేష్ తోడల్లుడు గీతం యూనివర్శిటీకి భూపందేరం, మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణ అంశాలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు ఆడుతున్నారన్నారు. చంద్రబాబు తీరు మార్చుకుని హిందువుల మనోభావాలకు గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. సమావేశంలో ఎంపీపీలు పూతినీడి వెంకటేశ్వరరావు(పెద్ద), కర్రి వెంకట నారాయణ రెడ్డి (వాసు), మండల కన్వీనర్లు జక్కంశెట్టి శ్రీరాములు, పిల్లి నాగన్నలు, మండల కమిటి నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


