తిరుమలలో ఒక రోజు అన్నప్రసాద వితరణకు విరాళం ఎంతంటే?

Distribute annaprasadam one day with donation of Rs 33 lakhs in TTD - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళ పథకం ప్రారంభించింది. ఇందుకోసం ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ కోసం రూ.33 లక్షలు విరాళం ఇవ్వాల్సి ఉంటుంది.

ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సమయంలో దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.  

చదవండి: (చిత్తూరు: రొంపిచర్లలో టీడీపీ కార్యకర్తల బరితెగింపు)

మరిన్ని వార్తలు :

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top