58.04 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి

Disbursement of pensions is complete for Above 58 Lakh In AP - Sakshi

సాక్షి, అమరావతి: పింఛన్ల పంపిణీ రెండో రోజుకు 95.90% పూర్తయింది. శనివారం కూడా వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు పంపిణీ చేశారు. ఈ నెలలో ప్రభుత్వం 60.52 లక్షల మందికి రూ.1537.68 కోట్లు విడుదల చేయగా.. శనివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 58,04,471 మంది చేతికి రూ.1474.34 కోట్లు చేరాయి. మిగిలిపోయిన వారి కోసం మంగళవారం వరకూ వలంటీర్ల ద్వారా పంపిణీ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. 

బెంగళూరుకు వెళ్లి మరీ పింఛన్‌ పంపిణీ
సదుం: చిత్తూరు జిల్లా సదుం మండలం చెరుకువారిపల్లె సచివాలయం పరిధిలోని జోగివారిపల్లెకు చెందిన జగన్నాథరెడ్డి ఇటీవలే కంటి ఆపరేషన్‌ చేయించుకుని బెంగళూరులో ఉంటున్నారు. వలంటీర్‌ గణపతి శనివారం సుమారు 180 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆయనకు వృద్ధాప్య పింఛన్‌ అందించాడు.     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top