పల్నాడు: జిల్లాలోని కారంపూడి వీర్ల తిరునాళ్లలో అపశృతి చోటు చేసుకుంది. నాగులేరులో 8 మంది భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. ఈ ఘటనలో చిలకలూరిపేటకు చెందిన జాల నరసింహం అనే భక్తుడు మృతిచెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కరెంటు తీగలు తెగి నాగులేరులో పడటంతో ప్రమాదం సంభవించింది. విద్యుత్ తీగలు తెగి నాగులేరులో పడటాన్ని గమనించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


