తల్లికి తలకొరివి పెట్టిన కూతురు | Daughter Did Mothers Last Rituals In Vizianagaram | Sakshi
Sakshi News home page

కన్నతల్లికి కన్నీటి వీడ్కోలు

Mar 4 2021 1:19 PM | Updated on Mar 4 2021 1:19 PM

Daughter Did Mothers Last Rituals In Vizianagaram - Sakshi

తల్లికి తలకొరివి పెడుతున్న కుమార్తె శాంతి 

ఇచ్ఛాపురం రూరల్‌: తల్లి మరణించడంతో కూతురే కొడుకై తలకొరివి పెట్టిన ఘటన బుధవారం ఇచ్ఛాపురం మండలం కేశుపురంలో చోటుచేసుకుంది. తెలుకల బృందావతి కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. ఈమె ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరు దివ్యాంగులు. భర్త హడ్డీ సాహూ కుటుంబాన్ని వెళ్లిపోవడంతో కూలి పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. బుధవారం తీవ్ర అస్వస్థత కారణంగా బృందావతి మృతి చెందింది. చిన్న కుమార్తె, దివ్యాంగురాలు శాంతి అన్నీ తానై తల్లికి తలకొరివి పెట్టింది. ముగ్గురు అవివాహిత కుమార్తెల్లో ఇద్దరు దివ్యాంగులు కావడంతో ప్రభుత్వం చేయూతనందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement