తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌ | Current booking in Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో కరెంట్‌ బుకింగ్‌

Aug 6 2021 3:49 AM | Updated on Aug 6 2021 7:44 AM

Current booking in Tirumala - Sakshi

శ్రీ పద్మావతి అతిథి గృహం వద్ద కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ కేంద్రం

తిరుమల: తిరుమలలో అద్దె గదులకు కరెంట్‌ బుకింగ్‌ చేసుకునే భక్తుల నుంచి కాషన్‌ డిపాజిట్‌ తీసుకునే విధానాన్ని టీటీడీ గురువారం ప్రారంభించింది. తిరుమలలోని 17 ఉప విచారణ కేంద్రాల్లో భక్తులకు గది తాళం ఇచ్చే సమయంలో కాషన్‌ డిపాజిట్‌ తీసుకుని గదిని ఖాళీ చేసే సమయంలో రిఫండ్‌ కేంద్రాల ద్వారా తిరిగి చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కరెంట్‌ బుకింగ్‌ రూ.50 నుంచి రూ.500 వరకు అద్దె గదులు పొందిన భక్తుల నుంచి రూ.500 కాషన్‌ డిపాజిట్‌ వసూలు చేస్తుండగా, రూ.501 నుంచి రూ.1000 వరకు, రూ.1001 నుంచి రూ.6,000 వరకు అద్దె ఉన్న గదులకు అంతే మొత్తంలో కాషన్‌ డిపాజిట్‌ తోపాటు, జీఎస్టీని భక్తుల నుంచి తీసుకుంటున్నారు. గదులను ఖాళీ చేసిన సమయంలో కాషన్‌ డిపాజిట్‌ తిరిగి ఇచ్చేందుకు గతంలోనే ఏర్పాటు చేసిన రిఫండ్‌ కౌంటర్లను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడ కాషన్‌ డిపాజిట్‌ వివరాలను ప్రదర్శిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement