అనూష గర్భంలో ఆడబిడ్డ | Police Revealed Shocking Things In Duvvada Pregnant Woman Anusha Case, More Details Inside | Sakshi
Sakshi News home page

అనూష గర్భంలో ఆడబిడ్డ

Apr 16 2025 8:00 AM | Updated on Apr 16 2025 10:32 AM

Crucial Things Revealed in Pregnant Anusha case

పోస్టుమార్టం అనంతరం దువ్వాడలో అంత్యక్రియలు

 నిందితుడు జ్ఞానేశ్వర్‌కు రిమాండ్‌ 

మధురవాడ: భర్త చేతిలో హత్యకు గురైన గర్భిణి అనూష మృతదేహానికి కేజీహెచ్‌లో వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమె నిండు గర్భిణి కావడంతో కడుపులోని శిశువు కూడా మరణించింది. గర్భం నుంచి ఆడ మృత శిశువును బయటకు తీశారు. ఇరువురినీ చూసి కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అమ్మ తోటే వెళ్లిపోతున్నావా తల్లీ అంటూ గుండెలవిసేలా రోదించారు. అనూష తండ్రి ఇది వరకే చనిపోగా.. తల్లి అంధురాలు కావడం మరింత ఆవేదనకు గురి చేసింది. 

ప్రత్యక్షంగా భార్యను, పరోక్షంగా తల్లి కడుపులో బిడ్డను హత్య చేసిన నిందితుడు గెద్దాడ జ్ఞానేశ్వర్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. అనూష అంత్యక్రియలను దువ్వాడలో పూర్తి చేశారు. కాగా.. దువ్వాడకు చెందిన జ్ఞానేశ్వర్‌ నర్సీపట్నం రోడ్డులోని అడ్డురోడ్డు తిమ్మాపురానికి చెందిన కేదారిశెట్టి అనూష (27)ని ప్రేమించాడు. 2023లో సింహాచలంలో పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలు ఏడాది నుంచి  మధురవాడ మిథిలాపురి వుడాకాలనీ ఆర్టీసీ డిపో సమీపం లలితా విహార్‌ అపార్ట్‌మెంట్‌లోని 303వ నంబర్‌ ప్లాట్‌లో నివాసం ఉంటున్నారు. 

మనస్పర్థలు కారణంగా వారి మధ్య గొడవలు జరుగుతు న్నాయి.  ఏడాది కాలంగా ఆమె అడ్డు తొలగించుకునేందుకు రకరకాలుగా ప్రయతి్నస్తున్నాడు. పిల్లలు పుడితే ఆమెను వదిలించుకోవడం మరింత కష్టమని భావించి.. హత్యకు పథకం వేశాడు. సోమవారం తెల్లవారుజామున ఆమె పీక నులిమి కిరాతకంగా చంపేశాడు. భార్యతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా హత్య చేసినందుకు పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. నిందితుడిని భీమిలి కోర్టులో హాజరు పరచగా.. మెజి్రస్టేట్‌ 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో నిందితుడిని సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు సీఐ బాలకృష్ణ తెలిపారు.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement