Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Crowd Of devotees is common in tirumala | Sakshi
Sakshi News home page

Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Aug 6 2024 8:40 AM | Updated on Aug 6 2024 9:39 AM

 Crowd Of devotees is common in tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 63,095 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,127 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి కానుకల రూపంలో హుండీ ద్వారా రూ.3.72 కోట్ల ఆదాయం వచ్చింది. 

టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టికెట్లు లేని వారికి 5 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనమవుతోంది. ఈ క్రమంలోనే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ముందుగా వెళ్లిన భక్తులను అనుమతించమని వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement