కోవిడ్‌ పేషెంట్ల కోసం టీటీడీ కీలక నిర్ణయం

Covid Crisis TTD Construct 22 German Sheds In AP - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా 22 జర్మన్‌ షెడ్ల నిర్మాణం

 3.52 కోట్ల రూపాయలు మంజూరు చేసిన టీటీడీ

సాక్షి, అమరావతి: కరోనా బాధితుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ పేషెంట్ల కోసం జర్మన్‌ షెడ్ల నిర్మాణానికి టీటీడీ ముందుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మొత్తం 22 జర్మన్‌ షెడ్లు ఏర్పాటు చేయడానికి టీటీడీ నిర్ణయించింది. వీటి నిర్మణానికి గాను 3.52 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ.. టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది.

మొత్తం 22 షెడ్లలో విశాఖలో 4, ప్రకాశంలో 2, కర్నూలులో 2, అనంతపురం, కృష్ణా, గుంటూరు, కాకినాడలో మూడు షెడ్ల చొప్పున నిర్మాణం.. ఇతర ప్రాంతాల్లో మరో 2 షెడ్లు నిర్మించనున్నట్టు టీటీడీ తెలిపింది.షెడ్లు నిర్మించేందుకు కలెక్టర్లకు నిధులు అందించనుంది. ఇకఒక్కో షెడ్‌లో సుమారు 30 ఆక్సిజన్‌ పడకల ఏర్పాటుకు అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 

చదవండి: ఆలయాలకు కరోనా ఎఫెక్ట్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top