వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఏపీ ముందడుగు

Coronavirus: Covid Vaccination Started To Forty Five Years Group In AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో 45 ఏళ్లు నిండిన వారికి తొలి డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఈ టీకా స్పెషల్ డ్రైవ్ మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఇక జర్నలిస్టులకు కూడా తొలి డోస్ వ్యాక్సిన్‌ ఇవ్వనుంది. రాష్ట్రంలో తొలుత 45 ఏళ్లు నిండిన వారికి కోవిడ్‌ టీకాలు వేయడం పూర్తయ్యాకే 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల  వారికి ఇస్తామని, ఇది ప్రభుత్వ నిర్ణయమని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు 78,78,604 మందికి వ్యాక్సిన్‌ వేశారు. 1.55 లక్షల డోసులు కోవాగ్జిన్, 11.58 లక్షల డోసులు కోవిషీల్డ్‌ను జిల్లాలకు పంపించారు. 23.38 లక్షల మందికి రెండు డోసుల వ్యాక్సిన్‌ పూర్తయింది. జూన్‌ 15 వరకు రాష్ట్ర వద్ద ఉన్నది, కేంద్రం ఇచ్చేది అంతా కలిపితే 28.56 లక్షల డోసులు కానుంది.

చదవండి: Cyclone Yaas: అమిత్‌ షాతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top