దుర్గగుడిలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు నిజమే | Commissioner of Endowments and Charities reacts on drinking water problem in Durga Temple | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో తాగునీటి పంపిణీలో ఇబ్బందులు నిజమే

Oct 13 2026 5:52 AM | Updated on Oct 13 2026 5:52 AM

Commissioner of Endowments and Charities reacts on drinking water problem in Durga Temple

దసరా ఉత్సవాల తొలి రోజు భక్తుల రద్దీని ఊహించలేదు 

దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ 

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల తొలి రోజు బెజవాడ కనకదుర్గమ్మ దర్శనానికి ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేకపోయామని, అందువల్ల తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయని దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ అన్నారు. దసరా ఉత్సవాల్లో తొలి రోజు భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులను వివరిస్తూ ‘సాక్షి’ దినపత్రిక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో కమిషనర్‌ రామచంద్రమోహన్‌ సోమవారం దుర్గగుడికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 

ప్లాస్టిక్‌ వాడకం ఉండరాదనే ఉద్దేశంతో బబుల్స్‌ ద్వారా తాగు నీరు పంపిణీ చేశామని చెప్పారు. తాము ఊహించిన దానికన్నా అధికంగా భక్తులు తరలిరావటంతో ఆ ఏర్పాట్లు సరిపోలేదన్నారు. సోమవారం నుంచి మంచినీటి బాటిల్స్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. సామాన్య భక్తులకే త్వరతగతిన దర్శనం చేయటానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రసాదాల కొరత లేకుండా, అన్నదానంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసు­కు­న్నామన్నారు. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు 
కలగకుండా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement