సీఎం జగన్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు | CM YS Jagan Wishes People On The Eve Of Maha Shivaratri | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ మహా శివరాత్రి శుభాకాంక్షలు

Mar 11 2021 10:34 AM | Updated on Mar 11 2021 11:22 AM

CM YS Jagan Wishes People On The Eve Of Maha Shivaratri - Sakshi

విశేష పూజలు, జాగరణతో శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి అని, పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

సాక్షి, అమరావతి: మహా శివరాత్రి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విశేష పూజలు, జాగరణతో శంకరుని ధ్యానించే పవిత్రమైన రోజు మహాశివరాత్రి అని, పరమేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు.

నేడు గుడివాడకు సీఎం జగన్‌
సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తారు. గుడివాడ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొననున్నారు. గురువారం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయల్దేరి 11.30–11.50 గంటల మధ్య గుడివాడ మున్సిపల్‌ స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ జరిగే మహాశివరాత్రి ఉత్సవాల్లో  పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.45 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.
చదవండి:
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు  
ఆంధ్రజ్యోతిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement